Tuesday, 3 November 2026

నీల్వాయి లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

నీల్వాయి లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
వేమనపల్లి,ఏప్రిల్ 04, (జనంసాక్షి):
వీర హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని  మంగళవారం నీల్వాయి గురు స్వాములు ఏట మధుకర్,టాకూరి శంకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని గ్రామదేవతలకు క్షీరాభిషేకం చేసి అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించారు.ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జైశ్రీరాం.. జైజై శ్రీరాం.. రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ అంటూ భక్తుల నినాదాలతో రామ,హనుమంతుల నామస్మరణ మార్మోగింది.హనుమాన్​ నామస్మరణతో.. గ్రామంలో కాషాయ వర్ణంతో…ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ శోభాయాత్రలో సర్పంచ్ గాలి మధు,గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.