నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ, కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ని కలిసిన బీరెల్లి దానయ్య.

నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ, కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ని కలిసిన బీరెల్లి దానయ్య.

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 5 జనం సాక్షి.
హైదరాబాదులో పరిశ్రమల భవన్ లో ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జోగులాంబ గద్వాల జిల్లా బహుజన సేన జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరారు.
రాష్ట్రంలో వేలాది ఎస్సీ, ఎస్టీ, కేసులు పెండింగు ఉన్నాయని, ఎంతోమంది కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతున్నారని, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులైన ఇంతవరకు పరిహారం అందలేదు అని, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ స్పందిస్తూ త్వరగా పరిశీలించి ఎస్సీ, ఎస్టీ లకు త్వరగా న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందనీ ఆయన అన్నారు.