Wednesday, 4 November 2026

నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ

నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ..

వీణవంక డిసెంబర్ 4 (జనం సాక్షి) వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పర్లపల్లి రమేష్ ఉపసర్పంచ్ అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డి వారు టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిఎస్సార్ నిధుల నుండి విడుదలైన 20 లక్షల రూపాయల నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనం నిర్మాణం చేయడం జరుగుతుంది అనంతరం పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో పాటు నూతన భవనాల నిర్మాణం సిసి రోడ్లు డ్రైనేజీలు గ్రామాలలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకురావడం జరిగిందని గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటాయని వారన్నారు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోరే స్వామి .కిష్టంపేట సర్పంచ్ బండ ముత్తయ్య మాజీ సర్పంచులు
వెంకటేష్. మహేందర్ రెడ్డి. వార్డ్ మెంబర్లు
కర్ణ తిరుపతి . అశోక్ . రమేష్.
సారయ్య. సంధ్య. లావణ్య పుష్ప. నిర్మల. స్రవంతి. నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి.
తాటికొండ శ్రీనివాస్ గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు