నూతన ధనలక్ష్మి పెట్రోల్ బంక్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
పెద్దవంగర జులై 20(జనం సాక్షి ) మండల కేంద్రంలోని బుధవారం నూతనగా ఏర్పాటు చేసిన ధనలక్ష్మి పెట్రోల్ బంక్ పంచాయతీరాజ్ శాఖ మరియు ఆర్డబ్ల్యూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులు చెక్కులు అందజేశారు తర్వాత మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత నూతనంగా ఏర్పడ్డ మండలం పెద్దవంగర రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందానని అన్నారు బంకు యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదవారి కుటుంబానికి అన్నగా ఉన్నాడు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, తాసిల్దార్ బి రమేష్ బాబు, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుక దాసుల రామచంద్ర శర్మ, మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు ఎదునూరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్తినేని శ్రీనివాస్, శ్రీరామ్ సుధీర్, తెరాస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ ,సర్పంచులు, ఉపసర్పంచులు,ఎంపీటీసీలు,టిఆర్ఎస్ నాయకులు,యూత్ నాయకులు, మాజీ సర్పంచులు,తదితరులు పాల్గొన్నారు