నూతన నియామకం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జై గౌడ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పట్టణానికి చెందిన రంగు ముత్యంరాజు గౌడ్ నియమితులయ్యారు.జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్ , రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా ఆయనను ఆ సంఘ జిల్లా అధ్యక్షులు చౌగోని సంతోష్ గౌడ్ నియమించారు.ముత్యంరాజు గౌడ్  జర్నలిస్ట్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, శబరిమల అన్నదాన భవన నిర్మాణ కమిటీ సభ్యులుగా , సుబ్రమణ్య స్వామి దేవాలయం కార్యదర్శిగా పని చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన సంఘ  జాతీయ అధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్ , రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ , జిల్లా అధ్యక్షులు చౌగొని సంతోష్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.