టేకులపల్లి, జూన్ 1( జనం సాక్షి ): టేకులపల్లి మండలానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, నగల వ్యాపారి గజ్జల రామశేఖర్, రమాదేవి దంపతుల కుమార్తె లావణ్య వివాహం బొజ్జాయిగూడెం ఎస్ ఎస్ గార్డెన్ లో గురువారం జరిగిన శుభకార్యంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ పాల్గొని నూతన వధూవరులు లావణ్య, వినయ్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులందరినీ కలిసి శుభాకాంక్షలు అందించారు. ఎమ్మెల్యే వెంటా స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.




