నూతన వధూవరులను ఆశీర్వదించిన జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి

అలంపూర్ నవంబర్ 23(జనంసాక్షి )నియోజకవర్గం లో గురువారం జరిగిన పలు వివాహ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా ఇటిక్యాల జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. ఉండవల్లి మండలం లో ని మారమునగాల గ్రామానికి చెందిన జోగులాంబ దేవి ఆలయ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్ సోదరుడు వెంకటరమణ గౌడ్ కుమార్తె సుచరిత వెడ్స్ యస్వంత్ గౌడ్ ల వివాహానికి అలంపూర్ చౌరస్తా లోని ఎజిఅర్ ఫంక్షన్ హాల్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం
అలంపూర్ మండల కేంద్రంలో లోని బీఅర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ వెంకటరమయ్య శెట్టి కుమారుని పునీత్ కుమార్ వెడ్స్ నంద మైత్రియి ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు.జెడ్పిటిసి వెంట
రవి ప్రకాష్ , కృష్ణ గౌడ్, మద్దిలేటి,నాయుడు,రాజన్న,సురేష్, రవి, బాలరాజు, పురుషోత్తం, విజయ్, తదితరులు పాల్గొన్నారు.