నూతన విద్యుత్ శాఖ డి ఈ గా బాధ్యతలు చేపట్టిన కే,వి రాజశేఖర్,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:
కాగజ్ నగర్ గ్రామీణం:(జనం సాక్షి)03 డిసెంబరు కాగజ్ నగర్ డివిసినల్ ఇంజనీర్ గా కె వి రాజశేఖర్ శనివారం రోజున బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ జిల్లాలో అసిస్టెంట్ డివిసినల్ ఇంజనీర్ గా పనిచేసి పదోన్నతి పై డివిసినల్ ఇంజనీర్ గా కాగజ్ నగర్ కు వచ్చారు. ఇంచార్జి డివిసినల్ ఇంజనీర్ గా పనిచేసిన సంపత్ కుమార్ డి ఈ గారు పదోన్నతి పై అదిలాబాద్ సుపేరెండేంట్ ఇంజనీర్ గా వెళ్లారు. ఈ సందర్భంగా రాజ శేఖర్ కి శాలువా పుష్ప గుచ్చలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏ డి ఈ శ్రీనివాస్, ఏ ఏ ఓ తుకారం,యూనియన్ నాయకులు చంద్రశేఖర్, ఎమ్మాజి సతీష్,విలాస్,వెంకటేష్, శ్రీనివాస్, రమేష్,మురళి,ప్రతాప్,రామకృష్ణ, శ్రీరాములు, ప్రవీణ్, ఏ ఈ లు సంతోష్,జగన్మోహన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.




