నూతన సచివాలయానికిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం దేశానికే గౌరవం
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 15
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణ చేయడం అన్ని వర్గాలు ఆశించదగ్గ విషయమని పేర్కొన్నారు యావత్ భారతదేశ ప్రజానీకం ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తుందని చెప్పారు కృతజ్ఞత భావంతో పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, వైస్ ఎంపీపీ పులికోట రమేష్, పిటిసిల పురం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు ఎస్ కే మోయిన్, టిఆర్ఎస్ పార్టీ కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల కుమార్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడ మల్ల వీరస్వామి, కొత్తగట్టు మచ్చ గిరిజన స్వామి దేవస్థానం చైర్మన్ తూముల శ్యామ్ రావు, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు హనుమంతు, టి అనుబంధ సంఘ నాయకులు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అరక సంఖ్యలో పాల్గొన్నారు