నూతన సీసీ రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే
హుజూర్ నగర్ నవంబర్ 28 (జనం సాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 6 వార్డ్ లో ఎస్ డి ఎఫ్ రూ. 5 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, పట్టణ పార్టీ అధ్యక్షులు ఆమర్నాధ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మెన్ జక్కుల నాగేశ్వర్ రావు, 6వ వార్డు కౌన్సిలర్ రాంగోపి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నూతన సీసీ రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే




