నూలి పురుగుల మాత్రల పంపిణి.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 15, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో గురువారం జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా ఆర్థిక, ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచనల మేరకు ప్రాథమిక పాఠశాలలో 1-19 సంవత్సరాల వయస్సు గల ఉన్న పిల్లలందరికీ నూలి పురుగుల నిర్మూలనకు మాత్రలు పంపిణీ చేసినట్లు జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నూలు పురుగుల అనేవి పిల్లల శరీరంలో ఉన్నట్లయితే పిల్లలకు అందించే అన్ని రకాల పోషక పదార్థాలను తీసుకుంటూ పిల్లల శారీరక ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటాయన్నారు.కావున పిల్లలకు నులి పురుగుల నిర్మాణ మందులు వేయించడంలో తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆది వనిత వేణుగోపాల్, మండల విద్యాధికారి నర్సవ్వ,మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సుభాషిని, గీతా భవాని, సూపర్వైజర్ శ్రీనివాస్, కరుణ ఏఎన్ఎం,సంతోష్ కుమార్ ఏపీ ఎంఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area