నెన్నెల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గట్టు మల్లేష్.
బెల్లంపల్లి, జులై 26, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నెన్నెల మండల కేంద్రానికి చెందిన గట్టు మల్లేష్ నియామకం అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధ్యక్షుడు మల్లు రవి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.