నెహ్రూ నాయక్ సౌజన్యంతో వీఆర్ఏల వంటావార్పు

దంతాలపల్లి ఆగస్టు 16 జనం సాక్షి
పే స్కేలు అమలు చేయాలని,ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలనే డిమాండ్లతో గత 23 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ బాధ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ సౌజన్యంతో మండల పార్టీ అధ్యక్షులు కందిమల్ల భరత్ బాబు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నాయకులతో దీక్షా శిబిరం వద్ద వంటావార్పు ఏర్పాటుచేసి వారికి సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ బాబు, నాయకులు రాజీవ్ కుమార్, వినీత్, పాపయ్య, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.