Tuesday, 3 November 2026

నేటినుంచి ఇన్‌స్పైర్‌

 

హైదరాబాద్‌,ఆగస్ట్‌28 :  చిన్నారుల్లో దాగివున్న మేథను బయటకు తీసే ఇన్‌స్పైర్‌ ఈనెల 29 నుంచి 31 వరకు జరుగనుంది. బాల శాస్త్ర వేత్తలను తయారు చేసేందుకు ఉద్ధేశించిన ఇన్‌స్పైర్‌కు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్‌ మూడో వారంలో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమికంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.ఈనెల 29 నుంచి 31 వరకు నాలుగు ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకనటలో తెలిపారు. సుస్థిర అభివృద్ధికి విజ్ఞానశాస్త్రం అనే ప్రధాన అంశం, దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి అనే ఉప అంశంపై ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నామన్నారు.