Monday, 2 November 2026

నేటినుంచి మహిళలకు ఆహార శిక్షణ

హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): రక్షిత ఆహార తయారీ పర్యవేక్షణపై జూన్‌ 1వ తేదీ  శుక్రవారం నుంచిశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అలిప్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రమాదేవి తెలిపారు. ఈ శిక్షణను భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలిప్‌ ఇండియా), ఆహార ఉత్పత్తుల నియమ నిబంధనల సంస్థ(ఎఫ్‌ఎ?సఎ?సఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తోంది. కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో అలిప్‌ ఇండస్టియ్రల్‌ ఎస్టేట్‌లో జరిగే ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రక్షిత ఆహార ఉత్పత్తులతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా శిక్షణా కార్యక్రమం రూపొందించినట్లు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికులు, విద్యార్థులు శిక్షణలో పాల్గొనవచ్చునని, మరిన్ని వివరాలకు ఫొనక్ష నెం.8978988004ను సంప్రదించాలన్నారు.