Wednesday, 4 November 2026

నేటినుంచి శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమాలు

హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శిల్పారామంలో మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం అధికారులు తెలిపారు. జూన్‌ 1,2,3 తేదీల్లో ప్రతి రోజూ సాయంత్రం కూచిపూడి, భరతనాట్యం, పోక్‌డ్యాన్స్‌, జానపద నృత్యాలు వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధప్రదేశ్‌, బెంగళూరు, కేరళ, ఒడిశా, ప్రముఖ జానపద కళాకారులు, నృత్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలిపారు.