Tuesday, 3 November 2026

నేటి నుంచి ఉచిత చెస్ శిక్షణ

 

 

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): చెస్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ సౌజన్యంతో నేటి నుంచి ఉచిత చెస్ శిక్షణను అందించనున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.సతీష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత చెస్ శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల గండూరి రామస్వామి జానకమ్మ ఫ్రీ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.విద్యార్థులు క్రమం తప్పకుండా చెస్ సాధన చేస్తే మేధాశక్తి పెంపొందుతుందని అన్నారు.వేసవి సెలవుల్లో విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉచిత చెస్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.