Tuesday, 3 November 2026

నేటి నుంచి తెలంగాణలో రైతు సంవేదన యాత్ర

హైదరాబాద్‌: రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించటానికి, వ్యవసాయ సంక్షోభానికి కారణాలేంటో వివరించడానికి చేపట్టిన రైతు సంవేదన యాత్ర శనివారం తెలంగాణలో ప్రవేశించనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రవేశించే యాత్ర రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల గుండా మహారాష్ట్రకు వెళుతుంది. యాత్ర తెలంగాణలో రెండు రోజులపాటు కొనసాగనుంది. స్వరాజ్య అభియాన్‌ సంస్థ అధ్యక్షుడు, ఆమ్‌ఆద్మీపార్టీ మాజీ నేత ప్రొఫెసర్‌ యోగేంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆయనతోపాటు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె.చిన్నయ్యసూరి తదితరులు పాల్గొంటున్నారు. ఈ యాత్ర ద్వారా రైతుల కష్టాలను, వ్యవసాయ సంక్షోభాన్ని దేశం దృష్టికి తీసుకెళ్తామని స్వరాజ్య అభియాన్‌ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *