నేటి యువతరం గాంధీజీ చూపిన శాంతి మార్గంలో పయనించాలి

– సర్పంచ్ నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి

 

-దసరా కానుకగా కోలాట బృందానికి చీరలు,కోలాట కర్రలు అందించిన సర్పంచ్

కురవి అక్టోబర్-2 (జనం సాక్షి): సత్యం, అహింస అనే మార్గం ద్వారా ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి దేశ ప్రజల ద్వారా భారత జాతిపిత అని కీర్తించబడుతున్న మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కురవి మండలం మొగిలిచర్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ గాంధీజీ చూపిన అహింస మార్గంలో ప్రయాణించి వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.గ్రామ సీమలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు అని మహాత్ముడు అన్నారని ఆమె అన్నారు.అందుకే వారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇవాళ గ్రామాలన్నీ పరిశుభ్రత పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు.తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం గ్రామాల్లో నిధులు అత్యధికంగా అందిస్తున్నాఅని, దీంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి అన్నారు.అనంతరం బతుకమ్మ కోలాట బృందానికి సర్పంచ్ నూకాల అనిత వేణుగోపాల్ రెడ్డి తన సొంత ఖర్చులతో దసరా పండుగ కానుకగా కోలాటం చేసే బృందానికి చీరాలు,కోలాట కర్రలు అందించారు.ఈ కార్యక్రమంలో నూకల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్,ఎంపీటీసీ చల్లగుండ్ల గణేష్,ఉప సర్పంచ్ గీత నరేష్,వార్డు సభ్యులు బాణాల శ్రీను,నీలం రమేష్, నాగేష్,గ్రామ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి,ఆశ వర్కర్లు,గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.