Thursday, 5 November 2026

నేడు ఆర్టీఏ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌  : ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను శనివారం నిర్వహిస్తున్నామని హైదరాబాద్‌ జేటీసీ టి.రఘునాథ్‌ తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ఎంతో ప్రాధాన్యత ఉందని.. పల్లెల నుంచి పట్టణాల వరకు ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఉద్యోగులందరూ పాల్గొ నేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రవాణాశాఖలో జరిగే బతుకమ్మ వేడుకలకు మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, గ్రేటర్‌ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల ఉద్యోగులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *