నేడు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల సమావేశం
******
సైదాపూర్ : జనం సాక్షి అక్టోబర్29తమ సంఘం మండల సమావేశం మండల కేంద్రంలోని మీసేవ సదాశివ కేంద్రం ఆవరణలో ఆదివారం నిర్వహించబడుతుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల ఆడహక్ కమిటీ కన్వీనర్, లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు తెలిపారు. ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ… ఈ సమావేశానికి ముఖ్య అథితులుగా జాతీయ ఉపాధ్యక్షులు మేడిపల్లి బాపయ్య ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ , జిల్లా అధ్యక్షులు సాంబరి కొమురయ్య, రాష్ట్ర నాయకులు మొగురం రమేష్, కల్వల రామచంద్రం, కుంభాల లతాశ్రీ తదితరులు హాజరవుతారని ఆయన చెప్పారు. ఈ సమావేశం ఉదయం పదిగంటలకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు, నాయకులు, మహిళలు, అంబేద్కరిస్టులు హాజరుకావాలని ఆయన కోరారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాన్ని పటిష్ట పరిచేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, అలాగే సమావేశ అనంతరం మండల కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్, నాయకులు బుర్ల మొగిలి, కిటకిట రాజు ముదిరాజ్, కోడం సురేష్, గాలిబ్ రమేష్ ముదిరాజ్, ఎర్రల శ్రీనివాస్, బత్తుల రమణ తదితరులు పాల్గొన్నారు.




