నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నాను విజయవంతం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గడ్డం సత్యనారాయణ
అశ్వరావుపేట సెప్టెంబర్ 20( జనం సాక్షి )
ప్రజా సమస్యలు అమలు కోసం నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గెడ్డం సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల కుంటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చి ప్రయత్నంలో ఉందని ఆయన అన్నారు. మరిన్ని సమస్యల కోసం కొత్తగూడెంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమంలోప్రజా సంఘాలు,రైతు సంఘాలు, మహిళా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు