Tuesday, 3 November 2026

నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన ర్యాలీలో పార్టీ శ్రేణులుఆదిక పాల్గొని విజయవంతం చేయాలి

 దెంది శశిధర్ రెడ్డి
ఎల్బీ నగర్( జనం సాక్షి )  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే   నిరసన ర్యాలీలో పార్టీ శ్రేణులుఆదిక పాల్గొని విజయవంతం చేయాలని  హస్తినాపురం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు   దెంది శశిధర్ రెడ్డి  పిలుపునిచ్చారు . తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  ఎనుముల.రేవంత్ రెడ్డి   పిలుపు మేరకు,  21 న     ఏ .ఐ. సి .సి .అధ్యక్షురాలు  సోనియాగాంధీ ని బీజేపీ నరేంద్ర మోదీ సర్కార్ ఈ . డి విచారణ పేరుతోపిలువడాన్ని నిరసిస్తూ, ఏ ఐ సి సి అగ్రనేత  రాహుల్ గాంధీ ని కూడా ఈ.డి పేర్లతో ఇబ్బందులకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ , తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల.రేవత్ రెడ్డి  ఆధ్వర్యం లో  సోమవారం    హైదరాబాద్  లోని  నెక్లస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుండి భాషీర్భాగ్ ఈ.డి .కార్యాలయం వరకు వేలాది మంది తో నిర్వహించబోయె  నిరసన ర్యాలీలో ఎల్బీనగర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు , పార్టీ ప్రజా ప్రతినిథులు, మాజీ ప్రజాప్రతినిధులు,  యూత్ కాంగ్రెస్ నాయకులూ , మహిళా కాంగ్రెస్ సోదరీమణులు  కాంగ్రెస్ పార్టీ  డివిజన్ల అధ్యక్షులు  కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,  కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతము చేయవలసిందిగా కోరారు .