Tuesday, 3 November 2026

నేడు కాపుల ఆత్మ గౌరవ సభ

– కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి
ఖైరతాబాద్: జూలై 30 (జనం సాక్షి) కాపు కులస్తుల సంక్షేమం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఈనెల 31న మియాపూర్ లోనే నరేన్ కన్వెన్షన్ సెంటర్లో కాపు కులాల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు కాపు సంఘాల సంక్షేమ సమితి తెలిపింది . ఈ మేరకు  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిర్యాల చిన్న రాఘవరావు, కె ఎస్ ఎన్ మూర్తి మాట్లాడారు.. కాపు ,బలిజ,తెలగ, ఒంటరి తెగల తెగలకు సంబంధించిన సుమారు పది లక్షల మంది గత మూడు దశాబ్దాలుగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు కూకట్ పల్లి పరిసర ప్రాంతాలలో వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. 2014, 2018 ఇది సంవత్సరాల లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు నిలబడి దాదాపు పది ఎమ్మెల్యే సీట్ల తో పాటు టి అర్ ఎస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించామని తెలిపారు. ఈ విషయంపై స్వయంగా మంత్రి కేటీఆర్ పిలిచి మాట్లాడడం జరిగిందని తెలిపారు. అందుకని అని తమకు ఐదు ఎకరాల భవనాన్ని కేటాయిస్తే తమ కులస్తులకు సంక్షేమం ఉపాధి విద్య వైద్యం సంబంధిత సహాయం కోసం ఉపయోగపడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో కోశాధికారి సుబ్బారావు కార్యనిర్వాహక సభ్యులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.