హైదరాబాద్: తెలంగాణ విద్యార్ధి జేఏసీ (టీఎస్‌జేఏసీ) అత్యవసర సమావేశాన్ని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించనున్నట్లు జేఏసీ ఛైర్మన్ పిడమర్తి రవి, అధ్యక్షుడు రాజారాంయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ, నూతన కార్యవర్గ తదితర అంశాలపై చర్యించనున్నట్లు తెలిపారు.




