Tuesday, 3 November 2026

నేడు ట్యాంక్‌బండ్‌పై మహా బతుకమ్మ

Bathukamma3

– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ట్యాంక్‌బండ్‌పై మహా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంత్రి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. శకటంపై 30ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నామని, ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ హాజరవుతారని అన్నారు. ఆరువేల మంది మహిళలు బతుకమ్మలతో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్ర మార్గంలో బతుకమ్మ ఘాట్‌వద్ద జీహెచ్‌ఎంసీ, పర్యాటకశాఖ ఏర్పాట్లు చేసింది.