Tuesday, 3 November 2026

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

ఒక్కరు భాద్యత తీసుకోవాలి,

పరిశుభ్రతను పాటిరాల వారికి మంచి వాదుకు క కాల్వల దాంపారు. ఆ తర్వాత గ్రామం పేర్కొన్నారు. దృష్టిసారికి సర్పంచ్

బాల్కొండ, (జనంసాక్షి): గ్రామంలోని ప్రజలను అన్ని పనుల్లో భాగస్వాములను చేయడం వల్ల గ్రామాభివృద్ధి జరుగుతుందని రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ 30రోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు ఉండాలని 30రోజుల ప్రణాళికను సీఎం కేసీఆర్ రూపొందించారని, దీని ద్వారా పల్లెల రూపురేఖలు మారే అవకాశం ఉందని, అందుకు ఈ కార్యక్రమంలో అధికారులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ ప్రజల సహకారంతో పల్లెలు అభివృద్ధి చెందుతాయనే సంకల్పంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు. పల్లెలు పచ్చదనంగా, పరిశు భ్రంగా ఉండటానికి గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాలు కలిసి గ్రామం బాగుండాలనే ఉద్దేశ్యంతో గ్రామంలో వీధి, వీధి తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు క ృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. భవిష్యత్ తరాల వారికి మంచి వాతావరణం అందించాలంటే పచ్చదనం పెంపొందించి, పరిశుభ్రతను పాటిస్తే ఎలాంతి వ్యాధులు దరిచేరవని, అందుకు ప్రతి ఒక్కరు భాద్యత తీసుకోవాలని గ్రామస్తులకు హితవుపలికారు. గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, చిట్టాపూర్ గ్రామానికి యేడాదికి 45 లక్షల రూపాయలు మంజూరే చేస్తోందని, ఇలా నాలుగు సంవత్సరాలు మొత్తం 1.80కోట్ల రూపాయలు మంజూరు అవుతాయని, దీంట్లో 80లక్షల రూపాయలు సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణకు పోగా మిగిలిన నిధులతో మురికి కాల్వలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసుకోవచ్చునని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవచ్చునన్నారు. చిట్టాపూర్ గ్రామ పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకు కావాల్సిన ఎత్తిపోతల పథకం లేదా కాల్వల ద్వారా కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని పలువురు కోరగా, ఎంపీడీవో 4-5రోజుల తర్వాత గ్రామంలోకి వచ్చి కూర్చొని 57సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అందించే ఏర్పాట్లు చేస్తారని మంత్రి పేర్కొన్నారు. బీడీ పెన్షన్లకు కటాఫ్ డేట్ ను తీసివేస్తే మరిన్ని పెన్షన్లు పెరిగే అవకాశం ఉందని, దీనిపై అధికారులు దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఆర్ఎం.రావు, ఆర్డీవో శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ వనజ, ఎంపీటీసీ కవిత, | ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ లావణ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేష్, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు లింగాగౌడ్, గోవర్ధన్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.