Tuesday, 3 November 2026

నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నేడు జరుగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షత వహిస్తారు.  ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్‌ బ్యూరో సభ్యులు పాల్గొంటారు. ఉద్యమ కార్యాచరణ, పల్లెబాటపై సమీక్ష తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *