Tuesday, 3 November 2026

సౌర విద్యుత్‌ కేంద్రాల బిడ్ల సమర్పణకు నేటితో గడువు ముగింపు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ విక్రయించే బిడ్ల సమర్పణకు నేటితో గడువు పూర్తి కానుంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు వారికి భరోసా ఇస్తూ ప్రభుత్వం సౌర విద్యుత్‌ విధానాన్ని ప్రకటించింది. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ఇప్పటికే పలు సంస్థలు తమ ఆసక్తిని వెల్లడిస్తూ దరఖాస్తు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *