Wednesday, 4 November 2026

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని కాంగ్రెస్‌ అధిష్ఠానం, కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ ఉదయం 11 గంటలకు భేటీ అవుతున్నారు. పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో భేటీ కానున్న ఎంపీలు షిండే, ఆజాద్‌ ప్రకటనలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తమ భవిష్యత్‌ కార్యాచరణను నేతలు ఖరారు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *