Tuesday, 3 November 2026

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి):సాధారణ ఎన్నికల మంచుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రదతినిధులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఏదో ఒకటి తేల్చుకోలేక పోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఇవాళ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ఫోర్‌లీడర్లు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా భవిష్యత్‌ కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. సమావేశంలో మంత్రి జానారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఢిల్లీ వెళ్లి తెలంగాణ ఏర్పాటు కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తేనున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *