హైదరాబాద్: ఆదివారం జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2013 జరగనుంది.దేశవ్యాప్తంగా ఉన్న 600 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకాబోతున్నారు. మరోవైపు.. నవోదయ విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది 6 నుంచి పీఎఫ్, పనివేళలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారు.




