Wednesday, 4 November 2026

నేడు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్​నేడు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్​

నేడు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్​

షాద్ నగర్ వద్ద స్వాగతానికి భారీ ఏర్పాట్లు

సీఎం కేసీఆర్​ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్సైజ్​ శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​వారం రోజుల ముందు నుంచే సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఆయన ఎంవీఎస్​ కాలేజ్​ గ్రౌండ్‌‌లో మీడియాకు పర్యటన వివరాలు వెల్లడించారు. సీఎం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి షాద్ నగర్ బైపాస్ రోడ్డు మార్గంలో మహబూబ్​నగర్ చేరుకుంటారన్నారు. మొదట ఫారెస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా సింధు హోటల్ సమీపంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడి నుంచి భూత్పూర్ మార్గంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అనంతరం ఎంవీఎస్​ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ