హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. రాజీవ్ రంజన్, ఆర్‌వీ చంద్రవదన్, ఎన్. శివశంకర్ రిటైర్డ్ కానున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ మిశ్రాకు, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజేశ్వర్ తివారీకి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె. రామకృష్ణారావుకు, దేవాదాయ శాఖ కమిషనర్ కార్యదర్శిగా వి. అనిల్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. శివశంకర్ దేవాదాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.




