Tuesday, 3 November 2026

సికింద్రాబాద్‌ బరిలో జెరూసలెం ముత్తయ్య

చర్చిల ఫాదర్లను కలసి ఓటేయాలని వినతి

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా తరఫున స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జెరూసలెం మత్తయ్య రంగంలోకి దిగారు. ఈ మేరకు చర్చిలు, పాస్టర్లు సువార్తికులు లీడర్లను విశ్వాసులను కలసి మద్దతు కోరారు. వారిని సమస్యలు కైస్త్రవ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు ఒక స్వతంత్ర అభ్యర్థి పార్టీలకతీతంగా ఉండాలని ,అప్పుడే కైస్త్రవ హక్కులకు కైస్త్రవ రక్షణకు సువార్త ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వంతో, అధికారులతో రాజకీయ పార్టీలతో పోరాడేందుకు వీలుంటుందని అన్నారు. ఆ విషయంలో కైస్త్రవ జనాభా, కైస్త్రవ స్కూల్‌ క్రిస్టియన్‌ ఇన్ట్సిట్యూషన్స్‌ అధికంగా ఉన్న సికింద్రాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంచుకొన్నట్లు చెప్పారు. రేపటి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కైస్త్రవులు కైస్త్రవేతర హిందూ ముస్లింసిక్కు జైన్‌ మొదలగు అన్ని వర్గాల ఓట్లు పడే విధంగా ఈ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికయ్యే విధంగా అందర పాస్టర్లు ప్రార్థించ వలసినదిగా కోరారు. ఈ మేరకు మెట్టుగూడ రోమన్‌ కాతలిక్‌ చర్చి, సీతాఫల్మండి చర్చ్‌ మిగిలిన16 చర్చిల వరకు వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. స్వాతంత్రం పూర్వం నుండి కైస్త్రవులకు స్వతంత్ర డైరెక్ట్‌ ఎమ్మెల్యే లేకపోవడం ఉన్నా వారు సరిగా మాట్లాడకపోవడం పార్టీలో ఉన్నవారు అధికార పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడలేకపోవడం కాబట్టి కొన్ని సమస్యలను పరిష్కరించుకో లేక ఇబ్బందులు పడుతున్నామని ముత్తయ్య అన్నారు. కైస్త్రవులు చట్టసభలకు వెళ్లేందుకు తాను పోటీ చేస్తున్నానని జెరూసలెం మత్తయ్య అన్నాను. సికింద్రాబాద్‌ నియోజక పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల పాస్టర్లు కైస్త్రవ నాయకులు విశ్వాసులు మహిళలు యువకులు ఈ ఎన్నికల ప్రచారంలోసహకరించాలన్నారు.