హైదరాబాద్, సెప్టెంబరు 9 : హైకోర్టు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్ రానున్నారు. నగరానికి వస్తున్న రేవంత్‌రెడ్డికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు పోలీసు అకాడమీ వద్ద ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఎల్బీనగర్‌లో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డిల సమక్షంలో స్థానిక టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరనున్నారు.




