నేడే ఎస్సై ప్రాథమిక రాతపరీక్ష

-సిహెచ్.రామేశ్వర్ అడిషనల్ ఎస్పీ నాగర్ కర్నూల్….

నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు06(జనంసాక్షి)

తమ తమ హాల్ టిక్కెట్లు నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని,దానిపై కింద ఎడమవైపు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించవలేను.గెజిటెడ్ అధికారి సంతకము అవసరం లేదు.పదమూడు సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఇందులో పన్నెండు కేంద్రాలు నాగర్ కర్నూల్ లో మరియు ఒకపరీక్ష కేంద్రం పాలెం లో నిర్వహిస్తున్నారు. వీలైతే ఒక రోజు ముందే ఎగ్జాం సెంటర్ చూసుకుంటే మంచిది.ఎగ్జామ్ నకు వచ్చేటపుడు హాల్ టిక్కెట్,ఫోటో,పెన్ మాత్రం తెచ్చు కొనవలెను.రైటింగ్ ప్యాడ్ తెచ్చుకున్న సరే లేకున్నా సరే.సెల్ ఫోన్,వాచ్,క్యాలుకులేటర్,బ్యాగు,గొడుగు పరీక్ష సెంటర్ కు తేవద్దు,అవి పెట్టుకొనుటకు ఎలాంటి సౌకర్యం లేదు,బయట ఎక్కడైనా పెట్టుకోని రావలెను.అభ్యర్థుల వాహనాలు సెంటర్ బయట పెట్టుకొన వలెను,అందుకు పోలీసువరు సహకరించుతారు.పరీక్ష కేంద్రానికి తొమ్మిది గంటలకంటే ముందే చేరుకుంటే మంచిది మరియు పరీక్ష కేంద్రం తమదని నిర్ధారించుకుంటే మంచిది.
-ఉదయం 9 గంటలనుండి లోపలికి అనుమతిస్తారు.10 గంటలకు గేటు మూసేస్తారు,ఒక నిముషం ఆలస్యమైనా అనుమతి లేదు
-మధ్యాహ్నం 1గంట వరకు కూర్చుని వుండాలి.ముందే పూర్తి అయినా బయటకు పంపరు.అందరికీ బయోమెట్రిక్ వేలిముద్రలు తీస్తారు.మాల్ ప్రాక్టీస్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొన బడును