Tuesday, 3 November 2026

నేపాల్ కు భారత్ సహాయం

హైదరాబాద్:

ఖాట్మండులో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు విదేశాంగ కార్యదర్శి జై శంకర్. భారత్ నుంచి నేపాల్ కు అన్ని విధాలా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేపాల్ వెళ్లాయని, పెద్ద ఎత్తున మందులు, నిత్యావసర వస్తువులు నేపాల్ కు పంపిస్తున్నామన్నారు. నేపాల్ లోని భారత ఎంబసీలో ఒక భవనం కూలి ఉద్యోగి భార్య చనిపోయిందని, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని, రేపటి నుంచి సహాయక చర్యలు మరింత ఊపందుకుంటాయన్నారు. భూకంప సహాయ చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఇటు దేశంలో భూకంప ప్రభావిత రాష్ర్టాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని జై శంకర్ చెప్పారు.
భూకంపం వల్ల దేశంలో 34 మంది చనిపోయారని, అందులో బీహార్ లో 23 మంది, యూపీలో 8, బెంగాల్ లో ముగ్గురు మృతిచెందారని వివరించారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో స్కూలు భవనం కూలి 40 మంది విద్యార్థులు గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *