Thursday, 5 November 2026

బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి రచించిన పుస్తకం ఆవిష్కరణ

ఖైరతాబాద్ : సెప్టెంబర్ 20 (జనం సాక్షి)  బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి రచించిన ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా ఫ్రమ్‌ డ్రీమ్స్‌ టు బిలియన్‌ డాలర్‌ సైయెంట్‌ పుస్తకాన్ని ప్రచురించినందుకు పెంగ్విన్‌ ఇండియా సంతోషిస్తున్నట్లు వెల్లడించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్‌ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది.భారతదేశంలో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు కాలంలో అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే భారీ అవరోధాలను సైతం అధిగమించి బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది వెల్లడిస్తుంది. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ ఆయన ఎన్నడూ లక్ష్య సాధనలో దృష్టి మరల్చలేదు. స్కాలర్‌షిప్‌తో విదేశాలలో విద్యనభ్యసించిన ఆయన తన జీవిత లక్ష్య సాధన కోసం తన నలభైలలో ప్రయాణం ఆరంభించడానికి ముందు సుదీర్ఘంగా 18 ఏళ్ళు ఎన్నో బాధ్యతలను నెరవేర్చారు. ఆయన ప్రారంభించిన సైయెంట్‌ను ప్రోత్సహించడం నుంచి ఔట్‌సోర్డ్స్‌ ఇంజినీరింగ్‌ సేవలలో అగ్రగామిగా దానిని తీర్చిదిద్దడం ‘ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా’ బ్రాండ్‌ను పరిచయం చేయడం వరకూ దీనిలో వివరించారు. ఈ పుస్తకం, పాఠకులకు ఓ వ్యవస్థాపకుని ఉద్విగ్నభరితమైన ప్రయాణం కళ్లముందుంచుతుంది. వారి వ్యాపార ఆకాంక్షలు, ప్రయోగాలకు ప్రాణం పోసే సాధనాలతో జీవిత సత్యాలను చూడటానికి వారిని అనుమతిస్తుంది. తన పుస్తకం విడుదల చేయడం గురించి రచయిత మాట్లాడుతూ ‘ఓ ఆలోచన నుంచి అంతర్జాతీయ స్ధాయి వ్యాపార సంస్ధగా విస్తరించడానికి ఏమి అవసరమో ఓ అనుభవపూర్వకమైన సాక్ష్యాన్ని ఇది అందిస్తుందన్నారు. భారతదేశంలో ఓ వ్యాపారవేత్తలో కనిపించని కోణాలను సైతం ఇది వెల్లడించడంతో పాటుగా సంక్షోభ నిర్వహణ, ఉద్యోగుల నిర్వహణ, వినియోగదారుల లక్ష్యిత అంశాల పరంగా ఆచరణాత్మక పాఠాలను సైతం ఇది అందిస్తుందన్నారు. తన ప్రయాణం నుంచి భావితరపు వ్యాపారవేత్తలు స్ఫూర్తి పొందడంతో పాటుగా మరిన్ని పెద్ద కలలు కంటూ తమ సొంత విజయాన్ని తామే లిఖించుకునేలా స్ఫూర్తి కలిగించాలనేది తన ఆశ అన్నారు.