Friday, 6 November 2026

నేరేళ్లపల్లిలో రాజన్న సతీమణి లక్ష్మీ ప్రచారం

కమలం పువ్వు గుర్తుకే ఓటువేసి భారీ మేజార్టీతో గెలిపించాలి
మహిళలతో మమేకమై విస్తృత ప్రచారం చేసిన బీజేపీ నాయకులు
 ఎల్బీ నగర్ (జనం సాక్షి  )రాష్ట్రంలో సీఎం కేసీఆర్… ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్. ఇవాళ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లు… కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి రాజన్నను భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు శ్రీరాములు. నేరేళ్లపల్లి గ్రామంలో వాడవాడలో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి మహిళా సోదరీమణులను కలిశారు కోమటిరెడ్డి లక్ష్మీ  సహా అందెల శ్రీరాములు యాదవ్.
Attachments area