హైదరాబాద్:ఎంఎల్ సి ఎన్నికల నోటుకు ఓటు వ్యవహారంలో ఎపి సీఎం చంద్రబాబునూ అరెస్టు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఎంఎల్ సి కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర కీలకమైందని…హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి స్వయంగా ప్రకటించారని తెలిపారు. చంద్రబాబుపై ఆధారాలుంటే ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. చంద్రబాబు, టీఎస్ ప్రభుత్వం రాజీ చర్యలు ఏమైనా…ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుందన్నారు.




