హైదరాబాద్,జూన్5(జనం సాక్షి ): హీరా గ్రూప్ నిర్వాహకురాలు నౌహార షేక్‌ను కర్ణాటక పోలీసులువిచారిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఆమె ఇంట్లోనే నౌహారాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నౌహారా షేక్ మహిళా ఎంపవర్‌మెంట్ పార్టీ (ఎంఈపీ) స్థాపించారు. గత కర్ణాటక ఎన్నికల్లో ఎంఈపీ తరపున సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలొచ్చాయి. బెంగళూరు ఇందిరానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదులు అందాయి. గతంలో పలు రా/-రాల్లో కూడా నౌహారా షేక్‌పై చీటింగ్ కేసులు నమోదయ్యాయి.ఇదిలా ఉంటే కర్ణాటక పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వారెంట్‌తో వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి ఆమె ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా చూస్తుంటే ఆమెను అరెస్ట్ చేయడానికే వచ్చినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు నౌహారా షేక్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.




