Wednesday, 4 November 2026

*న్యాయమైన పోరాటం చేద్దాం…స్వర్ణకారుల పరువును నిలుపుకుందాం కౌలె జగన్నాథం.

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )     దొంగ బంగారం కేసుల్లో పోలీసుల బెదిరింపులకు స్వర్ణకారులు భయపడవద్దని, న్యాయబద్ధమైన పోరాటం చేయాలని అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలె జగన్నాథం అన్నారు    .  చండూరు విచ్చేసి బాధితులైన మహేశ్వరం వెంకటాచారి మొదలైన వారిని పరామర్శించారు. విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని తెలియజేశారు. ఒక విశ్వబ్రాహ్మణుడికి సమస్య వచ్చినట్లయితే మిగతా వాళ్ళందరూఏకమై, ఊకుమ్మడిగా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐకమత్యoగా విశ్వబ్రాహ్మణులు సంఘటితమైతే ప్రభుత్వాలు దిగివస్తాయని అన్నారు. దొంగ బంగారం కేసుల్లో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని, స్వర్ణకారులు నిజాయితీగా తమ పనులు చేసుకుంటున్నా  పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.ఈసమావేశంలో అఖిలభారత విశ్వబ్రాహ్మణ మహాసభ రాష్ట్ర సాంస్కృతిక ప్రధాన కార్యదర్శి మద్దోజు సుధీర్ బాబు, చండూరు మండలం స్వర్ణకార సంఘం అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం కోటి, ముప్పవరం వెంకటాచారి, గన్నవరం శ్రవణ్,చేపూరి రాజు పాల్గొన్నారు.