న్యాయవాదిగా నమోదు అయిన బెస్త.చిరంజీవి….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి ఉద్యమ నాయకుడు మెదక్ జిల్లా చిలప్ చేడ్ మండలంలోని సోమక్కపేట గ్రామని చెందిన బెస్త దశరథ కుమారుడు బెస్త చిరంజీవి గురువారం రోజున యువ న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తి చాలా గొప్ప వృత్తి అనీ, ప్రజల తరపున ఉండి, కనీసం న్యాయ సహాయం పొందలేని పేదవారికి సహాయం చేయొచ్చు అనే పద్ధతి లోనే, సర్వీస్ మోటో తో ఈ రంగంలోకీ వచ్చాను , ఎల్లప్పుడూ నేను పెదలకు న్యాయం చేసే దిశగా నా వృత్తి నీ కొనసాగిస్తాను అని అయన ఒక ప్రకటన తెలిపారు.