*బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన*

బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఒకటవ వార్డు పరిధిలో తామర చెరువు కట్ట సమీపంలో గ్రామ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి బతుకమ్మ ఘాట్ ,మెట్ల నిర్మాణ పనులను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ప్రతి ఏడాది ముత్యాలమ్మ ఉత్సవాల సందర్భంలో వర్షాల వల్ల ఆలయ సమీపంలో ఉన్న పంట కాలువ దాటుకుని వెళ్ళడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాలువపై కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దనసరి కోటమ్మ,ఉప సర్పంచ్ కవిత,వార్డు మెంబర్ జినుక రేణుక, ఎంపీటీసీ తిరుమల శైలజారెడ్డి, సొసైటీ డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి ,పంచాయతీ కార్యదర్శి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.