న్యూ లుక్‌లో అదరగొట్టిన బన్నీ

పుష్పను మించి ఉందంటూ సోషల్‌ విూడియాలో కామెంట్స్‌
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ న్యూ లుక్‌ ఇప్పుడు సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌ అవుతోంది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఎప్పుడూ లేనంత మాసీవ్‌గా పుష్ప సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప అదరగొట్టింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా, సమంత స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ప్లాన్‌ చేసిన మేకర్స్‌ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌లో ఉన్నారు. సీక్వెల్‌లోనూ అదే లుక్‌లో కనిపిస్తారని అందరూ భావిస్తున్న సమయంలో ఇలా సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చి సోషల్‌ విూడియాను షేక్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే లుక్‌తో పుష్ప సీక్వెల్‌ మూవీలో కనిపించబోతున్నారని, అందుకే ఈ మాస్‌ లుక్‌ని రివీల్‌ చేశారని మాట్లాడుకుంటున్నారు. అయితే, ’విక్రమ్‌’ సినిమాలో సూర్య పోషించిన రోలెక్స్‌ పాత్ర తరహాలో ఉన్న బన్నీ లుక్‌ మూవీ కోసం కాదు. ఓ కమర్షియల్‌ యాడ్‌ కోసం. ఈ యాడ్‌ ఫిల్మ్‌ ని హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఇక ఈ లుక్‌ విషయానికొస్తే..నోట్లో సిగార్‌ పెట్టుకొని నళ్ళ కళ్ళజోడుతో జుట్టు కాస్త తెల్లబడి పక్కా మాస్‌.. అనిపిస్తున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్‌ తాజా లుక్‌ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తాజావార్తలు