Tuesday, 3 November 2026

పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు డీజీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు కల్పిస్తామని డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామకక్షలు చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రం నుంచి అదనపు బలగాలు కోరతామని అయన తెలిపారు. ఎక్సైజ్‌ శాఖతో కలిసి సంయుక్త చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తామని శాంతిభద్రతల అదనపు డీజీ కౌముంది తెలిపారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అదేశించినట్లు ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *