పంచాయతీ కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వం
శామీర్ పేట్, జనంసాక్షి : గ్రామంలో ప్రతి రోజు పరిశుధ్యనిర్ములనకు అహర్నిశలు పాటు పడుతున్న పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోక పోవడం శోచనీయమని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు. శనివారం శామీర్ పేట్ మండల కార్యాలయం ముందు పంచాయతీ కార్మికుల ధర్నా 10వ రోజుకు చేరింది. శనివారం కార్మికుల సమ్మెకు ముఖ్య అతిధిగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం విచ్చేసి మాట్లాడారు. కార్మికులు ఆరోగ్యాన్ని సైతం లెక్క చెయ్యకుండా వెట్టి చాకిరీ చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గు చెటన్నారు. ఈ నియోజకవర్గం కార్మిక మంత్రి మల్లారెడ్డి కార్మికులను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి శివ బాబు,మండల కార్మిక నాయకులు శ్రీకాంత్, సుధాకర్, ముత్యాలు, లక్ష్మి,లావణ్య, తదితరులు
పాల్గొన్నారు.