కేసీఆర్ తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు
– పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ గురించి తాను ఎక్కడా వినలేదు
– ఎన్నికల హావిూలను కేసీఆర్ తుంగలో తొక్కారు
– విలేకరుల సమావేశంలో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
హైదరాబాద్, జులై 28(జనం సాక్షి) : సీఎం కేసీఆర్ పంచాయతీ వ్యవస్థను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడని, ఫలితంగా నూతన చట్టం అంటూ తెరపైకి తెస్తున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరుల మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. చాలా రోజులకు కేసీఆర్ కేబినెట్ విూటింగ్ పెట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు బుద్ధి పుట్టినప్పుడే మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల వాగ్ధానాల్లో ఏ ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. జర్నలిస్ట్ భవన్, గిరిజన భవన్ కడతామని చెప్పిన కేసీఆర్, ఇప్పడు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చూడటం వల్లే కోర్టు స్టే ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అలాగే ప్రగతి భవన్ నుంచే గ్రామ పంచాయతీ పాలన నిర్వహించాలని అనుకుంటున్నారని విమర్శించారు. చైనాలో మాదిరిగా పార్టీ, ప్రభుత్వం ఒక్కటేనన్న విధంగా కేసీఆర్
వెళ్తున్నారన్నారు. అసలు ఈ గ్రామ కార్యదర్శులు ఎక్కడ్నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవస్థ గురించి తాను వినలేదన్నారు. అంటే గ్రామ పంచాయతీలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారా? అని ఇంద్రసేనారెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో అరచేతిలో వైకుఠాన్ని చూపుతూ కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హావిూల్లో ఏ ఒక్కటి ఇప్పటి వరకు పూర్తి నెరవేర్చలేదని, కేవలం అదిగో అయిపోతుంది.. ఇదిగో అయిపోతుంది అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఏ ఒక్క హావిూని నెరవేర్చడం లేదని మండిపడ్డారు.




