సుధాకర్‌ది తెదేపా సర్కార్ హత్యే!
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వీడాలి
– హోదాకోసం పోరాటానికి టీడీపీ కలిసిరావాలి
– వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి, జులై28(జనం సాక్షి) : ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మదనపల్లి చేనేత కార్మికుడు సుధాకర్‌ది ఆత్మహత్య కాదని, చంద్రబాబు సర్కార్ చేయించిన హత్య అని ఆయన మండిపడ్డారు. శనివారం భూమన విలేకరులతో మాట్లాడుతూ.. ¬దా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వల్లే బలిదానాలు జరుగుతున్నాయన్నారు. ¬దా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా.. చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ¬దా సెంటిమెంట్‌గా మారిందని, ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. తిరుపతిలో గతంలోనే మునికోటి బలవన్మరణానికి పాల్పడ్డాడని, అప్పుడే తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. దయచేసి ఎవరూ ఆత్మ త్యాగాలకు పాల్పడవద్దని, ఇలాంటి ఘటనల వల్ల ప్రయోజనం లేదని, బతికి ఉండి అందరం కలిసి పోరాడి ¬దా సాధించుకుందామని భూమన పిలుపునిచ్చారు. చంద్రబాబు, తెదేపా నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు. టీడీపీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక ¬దాను వాడుకుంటున్నారని అన్నారు. వైసీపీ ఎంపీలతో కలిసి రాజీనామ ఆచేసి ఉంటే ఇప్పటికే ¬దా వచ్చేదని, ఇప్పటికైన ఎంపీలు రాజీనామా చేసి రావాలని, 25మంది ఎంపీలతో ఢిల్లీలో ధీక్షకు దిగితే ¬దా ఎందుకు రాదో తేల్చుకోవచ్చునని అన్నారు.